War 2 Trailer | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వార్ 2’. యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్యచోప్రా నిర్మిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. YRF స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఈ చిత్రంలో.. హృతిక్ రోషన్ కబీర్‌గా తిరిగి రాగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.