War 2 OTT | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ నటుడు ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వార్. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటించగా.. అనిల్ కపూర్, అశుతోష్ రాణా, అలియాభట్, బాబీ దేవోల్, శర్వారీ వాఘ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించాడు. ఈ చిత్రం ఇండెపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం అక్టోబర్ 09 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇండియన్ రా ఏజెన్సీలో ప్రముఖుడైన ఏజెంట్ కబీర్(హృతిక్) కిరాయి హంతకుడిగా మారి హత్యలు చేస్తుంటాడు. ఇదిలావుంటే.. చైనా, రష్యా, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలన్నీ ఒక కోటరీగా మారి, ‘కలి’ పేరుతో ఇండియా పతానానికి ప్లాన్ చేస్తాయి. ఈ మిషిన్‌ని కబీర్‌కు అప్పజెబుతాయి. కబీర్‌ను అడ్డుకునేందుకు విక్రమ్ చలపతి (జూనియర్ ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. అసలు కబీర్కీ, విక్రమ్‌కు మధ్య ఉన్న బంధం ఏంటి? ‘కలి’ వల్ల భారత ప్రధానికి పొంచివున్న ముప్పును వీరిద్దరూ ఎలా ఆపారు? ఈ మిషన్‌లో వింగ్ కమాండర్ కావ్య లూత్ర(కియారా అద్వానీ) పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/ABUr3PMuiw
— Netflix India (@NetflixIndia) October 8, 2025