War-2 Movie | వారం రోజుల కిందట ప్రకటన వచ్చిన వార్-2 గురించి ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంది. కలలో కూడా ఊహించని కాంబినేషన్ సెట్టయ్యే సరికి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో ఒక్క సారిగా హాట్ టాపిక్ అయిపోయింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లను ఒకే సారి స్క్రీన్‌పై చూడబోతున్నాం అనే ఫీలింగే ఒక హై ఇస్తుంది. అందులోనూ హీరోగా ఒకరు విలన్‌గా మరొకరు కనిపిస్తారనడం గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇది ఇద్దరి స్నేహితుల కథ అని తెలుస్తుంది. కృష్ణార్జునుల్లా ఉండే ఇద్దరు స్నేహితులు చివరికి శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది అనే కోణంలో సాగుతుందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇలాంటి కథలను మనం ఇప్పటికే ఎన్నో సార్లు చూసే ఉంటాం. కానీ ఇలా స్టార్ హీరోలు చేయడం ఇదే తొలిసారి. దాంతో రెండు ఇండస్ట్రీలలోనూ ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు ‘బ్రహ్మస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ సినిమాను ఇదే ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం తారక్, కొరటాల శివతో ఎన్టీఆర్30 చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ప్రతీ ఒక్కరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. పైగా జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ కాంబో రిపీటవడంతో ప్రతీ ఒక్కరిలోనూ ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది.