Waltair Veerayya Movie | మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చాలా కాలం తర్వాత చిరు నుండి వస్తున్న మాస్ ఎంటర్టైనర్ కానుండటంతో ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అదీ కాకుండా మాస్ మహరాజా రవితేజ కీలకపాత్ర పోషించడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే మేకర్స్ రిలీజైన పాటలు, టీజర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో చిరు గత సినిమాల ఫలితంతో సంబంధంలేకుండా ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌తో సంచలనం సృష్టిస్తుంది.
తాజాగా ఈ సినిమా యూఎస్ఏ ప్రీ బుకింగ్స్ సేల్స్ 100K డాలర్స్‌ను క్రాస్ చేసింది. రిలీజ్‌కు పది రోజులుండగానే ఈ రేంజ్లో టిక్కెట్స్ అమ్ముడవుతున్నాయంటే మెగాస్టార్ క్రేజ్ ఎలా ఉందో తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ రేంజ్లో ప్రెస్‌మీట్ నిర్వహించి చిత్రయూనిట్ మొత్తం సినిమా గురించి మాట్లాడారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను ప్రకటించనున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి యూనియన్ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్. చిరకు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. రవితేజ పోలీస్ అధికారిగా కీలకపాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.