Waltair Veerayya Pre-Release Event | మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చాలా కాలం తర్వాత చిరు నుండి వస్తున్న మాస్ ఎంటర్టైనర్ కానుండటంతో ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అదీ కాకుండా మాస్ మహరాజా రవితేజ కీలకపాత్ర పోషించడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే మేకర్స్ రిలీజైన పాటలు, టీజర్లకు విశేష స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలోని ఆర్కే బీచ్‌లో జరగాల్సిఉండగా.. పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. దాంతో ఈవెంట్ వేదిక మారుతున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ముందుగా నిర్ణయించినట్లు గానే ఆర్కే బీచ్‌లో ఆదివారం సాయింత్రం 5 గంటల నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగునుంది. కాగా శనివారం ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి యూనియన్ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్. చిరకు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. రవితేజ పోలీస్ అధికారిగా కీలకపాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.