Waltair Veerayya | మెగా మాస్ సాంగ్ వచ్చేసింది.. పూనకాలు తెప్పిస్తున్న చిరు, రవితేజ గ్రేసింగ్ స్టెప్స్
'అన్నయ్య' సినిమా తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కేఎస్ రవింద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
‘అన్నయ్య’ సినిమా తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కేఎస్ రవింద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా ఈ సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషిస్తుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఇటీవలే రిలీజైన రవితేజ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా రవితేజ, చిరంజీవి కలిసి స్టెప్పులేసిన పూనకాలు లోడింగ్ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. చిరంజీవి, రవితేజ కలిసి ఒకే ఫ్రేమ్‌లో స్టెప్పులేయడం అభిమానులకు నిజంగానే పూనకాలు తెప్పిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటను రోల్ రైడా, రామ్ మిర్యాలతో కలిసి దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించాడు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన మూడు పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లో ‘పూనకాలు లోడింగ్’ పాట కూడా చేరింది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఇక చిరు యూనియన్ లీడర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. చిరుకు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

