Waltair Veerayya Movie | అగ్ర ఓటీటీ సంస్థకు వాల్తేరు వీరయ్య డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ కూడా వచ్చేసింది?
'ఆచార్య', 'గాడ్‌ఫాదర్' వంటి మిశ్రమ ఫలితాల తర్వాత చిరు 'వాల్తేరు వీరయ్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'గ్యాంగ్‌లీడర్', 'ఘరానా మొగుడు' వంటి సినిమాల ఛాయలు పోస్టర్లు, ట్రైలర్లలో కనిపించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Waltair Veerayya Movie Ott Partner | ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’ వంటి మిశ్రమ ఫలితాల తర్వాత చిరు ‘వాల్తేరు వీరయ్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘గ్యాంగ్‌లీడర్’, ‘ఘరానా మొగుడు’ సినిమాల ఛాయలు పోస్టర్లు, ట్రైలర్లలో కనిపించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. పైగా మాస్ మహరాజా రవితేజ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం రిలీజై పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకుంది. థియేటర్ల వద్ద మెగా అభిమానుల సందడి హోరెత్తుతుంది. ఈ సంక్రాంతికి భారీ ఓపెనింగ్స్ సాధించే సినిమా ఇదే అవుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా హక్కులను ఓ బిగ్ ఓటీటీ సంస్థ దక్కించుకుంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ హక్కులను కూడా కొనుగోలు చేసిందట. కాగా ఈ సినిమాను 6 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని వీరయ్య బృందం నెట్‌ఫ్లిక్స్ సంస్థతో డీల్ కుదిరించుకుందట. ఈ లెక్కన చేసుకుంటే మార్చిలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

