Waltair Veerayya | మెగాస్టారా మజాకా.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌తో వాల్తేరు వీరయ్య సంచలనం..!
మెగా అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న 'వాల్తేరు వీరయ్య' శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు వీరయ్య సక్సెస్‌ను పండగలా జరుపుకుంటున్నారు.
Waltair Veerayya Firstday Collections | మెగా అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు వీరయ్య సక్సెస్‌ను పండగలా జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండగ ఒక రోజు ముందుగానే వచ్చిందంటూ థియేటర్లలో సంబురాలు చేసుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాపై ముందు నుండి మంచి బజ్ ఉంది. దానికి తోడు ‘గ్యాంగ్‌లీడర్’, ‘ఘరానా మొగుడు’ సినిమాల ఛాయలు పోస్టర్లు, ట్రైలర్లలో కనిపించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
పైగా మాస్ మహరాజా రవితేజ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. రొటీన్ కథే అని ముందే తెలిసిన బాబీ.. ఈ సినిమాను ఏ విధంగా మలిచాడు. చిరు, రవన్నలను ఎలా చూపించాడు అనే ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్లే మొదటి రోజు రూ.29 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించాడు. చిరు గత చిత్రం గాడ్‌ఫాదర్ మొదటి రోజు రూ.13 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే.. వాల్తేరు దానికి రెండింతలు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో పడేసింది.
రెండో రోజు కూడా బుకింగ్స్ భారీ రేంజ్లో ఉన్నాయి. కాగా ఈ సినిమా ప్రభావం వీరసింహాపై గట్టిగా పడింది. తోలి రోజు రూ.25 కోట్ల షేర్ సాధించిన వీరసింహా రెండవరోజు కేవలం రూ.8 కోట్లతోనే సరిపెట్టుకుంది. వాల్తేరు వీరయ్య దెబ్బకు సగానికి పైగా డ్రాప్స్ పడ్డాయి. ఇక శనివారం వారసుడు విడుదలైంది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియోన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక సంక్రాంతి వీక్ అయ్యేలోపు ఎవరు ముందంజలో ఉంటారో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

