Waltair Veerayya Movie | ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ తర్వాత చిరంజీవి నుండి వస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ఇప్పటి నుండి ప్రమోషన్లు మొదలు పెట్టింది. తాజాగా వాల్తేరు వీరయ్య సెట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కాగా తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. చిరంజీవితో పాటు రవితేజ కూడా డబ్బింగ్ స్టూడీయోకి వచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. రవితేజ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఇటీవలే రిలీజైన ఆయన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. చిరంజీవి ఈ చిత్రంలో యూనియన్ లీడర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. చిరుకు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
#WaltairVeerayya Dubbing begins!#MegastarChiranjeevi #Raviteja @dirbobby @ThisIsDSP pic.twitter.com/umOhge9msI
— Sreedhar Sri (@SreedharSri4u) December 27, 2022