Waheeda Rehman | బాలీవుడ్ లెజెండరీ నటి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ (Waheeda Rehman)కు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ (Dadasaheb Phalke Lifetime Achievement) అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కినట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakoor) తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బహూకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వహీదా రెహమాన్ వయసు 85 ఏళ్లు. 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో వహీదాకు ఫాల్కే అవార్డును అందజేయనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీలోని అయిదుగురు సభ్యులు వహీదా రెహమాన్ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్యాసా(pyasa), కాగజ్ కే ఫూల్ (Kaagaj ke phool), చౌదవి కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్(Saheb biwi aur ghulam), గైడ్, ఖామోషి, ఢిల్లీ 6 (Delhi 6) వంటి చిత్రాలతో వహీదా రెహమాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిసారిగా కమల్ హాసన్ విశ్వరూపం (Vishwarupam), స్కేటర్ గర్ల్ సినిమాలో వహీదా అతిథి పాత్రలో మెరిసింది.
Veteran actor Waheeda Rehman declared the recipient of the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award this year
(file photo) pic.twitter.com/snegUQGr52
— ANI (@ANI) September 26, 2023
I feel an immense sense of happiness and honour in announcing that Waheeda Rehman ji is being bestowed with the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award this year for her stellar contribution to Indian Cinema.
Waheeda ji has been critically acclaimed for her…
— Anurag Thakur (@ianuragthakur) September 26, 2023