Bedurulanka 2012 | కార్తికేయ బెదురులంక 2012 ఎలా ఉందంటే..?
Bedurulanka 2012 | కార్తికేయ (Kartikeya), డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) కాంబినేషన్లో వచ్చిన బెదురులంక 2012 (Bedurulanka2012) నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. 2012 యుగాంతం కాన్సెప్ట్‌తో ఫన్ ఎలిమెంట్స్‌తో వినోదాత్మకంగా సాగుతుందని అంటున్నారు మూవీ లవర్స్.
Bedurulanka 2012 | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya), డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) కాంబినేషన్లో వచ్చిన చిత్రం బెదురులంక 2012 (Bedurulanka2012). క్లాక్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. 2012 యుగాంతం కాన్సెప్ట్‌తో ఫన్ ఎలిమెంట్స్‌తో వినోదాత్మకంగా సాగుతుందని అంటున్నారు మూవీ లవర్స్. ప్రీమియర్ షోల నుంచి వస్తున్న పాజిటివ్ రిపోర్ట్స్ మా టీంకు అదనపు బూస్ట్ అందించాయి. ఈ వీకెండ్లో క్రేజీ ఎంటర్టైన్మెంట్కు అంతా రెడీ. మా బేబి (సినిమా) ఇక మీది.. సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.. అంటూ ట్వీట్ చేశాడు కార్తికేయ.
నగరంలో ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు కార్తికేయ, నేహాశెట్టి. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. బెదురులంక 2012 ఫస్ట్ హాఫ్ బాగుందని, అద్భుతమైన కామెడీ ట్రాక్‌తో సెకండాఫ్ వినోదాత్మకంగా సాగుతుందని సినీ జనాలు చెబుతున్నాయి. మూడనమ్మకాలను క్యాష్ చేసుకొని ఎలా మోసం చేస్తారో సినిమాలో బాగా చూపించారని అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం బాగా ప్లస్ అయ్యిందని అంటున్నారు సినీ జనాలు. లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) ఈ చిత్రాన్ని నిర్మించారు.
With the extra boost from great positive reports from premiers,
All set to give you all a crazy entertainment this weekend..
Our baby is yours now😀#Bedurulanka2012 Now in cinemas pic.twitter.com/QjOtCfiXlw— Kartikeya (@ActorKartikeya) August 25, 2023
Nee screen presence anna 🔥🔥🔥#Bedurulanka2012 #Bedurulanka pic.twitter.com/iFyLwtmPsF
— Yashwanth (@YashwanthIam) August 25, 2023
బెదురులంక 2012 టీజర్..
వెన్నెల్లో ఆడపిల్ల రొమాంటిక్ ట్రాక్..
బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో..
బెదురులంక 2012 మోషన్ పోస్టర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

