బెల్లంకొండసాయిశ్రీనివాస్ కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ హిందీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ధవల్ జయంతిలాల్ గడ, అక్షయ్ జయంతిలాల్‌గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో విజయవంతమైన ‘ఛత్రపతి’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. శనివారం దర్శకుడు వినాయక్ పుట్టినరోజు వేడుకలు సెట్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత, వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాతో బెల్లంకొండసాయిశ్రీనివాస్ హీరోగా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నారు. అమిత్నాయర్, సాహిల్ వైద్ ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.