Jayaho Janardhana | వినూత్న చిత్రాల దర్శకుడు సంపత్ నంది చేతుల మీదుగా ‘జయహో జనార్ధన’ చిత్ర టైటిల్ పోస్టర్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. పానుగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పానుగంటి శరత్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఒక ఆహ్లాదకరమైన లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా రూపొందుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించి, సినిమా యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందన్న ఆయన, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాత మరియు దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా అవుట్‌పుట్ పట్ల తాము చాలా సంతృప్తిగా ఉన్నామని, సంపత్ నంది గారి చేతుల మీదుగా పోస్టర్ విడుదల కావడం తమ టీమ్ అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి వంటి హేమాహేమీలతో పాటు జబర్దస్త్ ఫేమ్ రాఘవ, అప్పారావు, రాజమౌళి మరియు పటాస్ ప్రవీణ్ వంటి ప్రముఖ హాస్యనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక రంగంలో నందమూరి హరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, విజయ్ ఠాగూర్ ఛాయాగ్రహణం అందించారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కో-డైరెక్టర్‌గా నరసింహారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కార్తిక్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టగా, ఈ చిత్రానికి నాగేశ్వరరావు (ఎస్ ఎన్ ఆర్) పిఆర్ఓగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.