Suriya | సూర్య సూపర్ ఫామ్.. మూడు నెలల్లో ఏకంగా రూ.540 కోట్ల కలెక్షన్లు
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి చేసిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో మరోసారి సంచలనం సృష్టించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ తాజాగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరింది.
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి చేసిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో మరోసారి సంచలనం సృష్టించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ తాజాగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘విశ్వనాథ్ & సన్స్’కు తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువ ప్రేక్షకులను కూడా సినిమా ఆకట్టుకోవడంతో వసూళ్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
కేవలం రెండు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్‌ను అందుకుంది. రెండో వారంలోనూ మంచి వసూళ్లతో థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్లో కూడా ‘విశ్వనాథ్ & సన్స్’ మంచి వసూళ్లు సాధిస్తోంది. విదేశీ మార్కెట్లో ఈ చిత్రం ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్, వెంకీ అట్లూరి మార్క్ కథనం, సూర్య నటన విదేశాల్లోని ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
‘వీరభద్రుడు’గా తెలుగులో విడుదలైన ‘కరుప్పు’ సినిమాతో సూర్య తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రం సుమారు రూ.340 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ‘విశ్వనాథ్ & సన్స్’తో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో, కేవలం మూడు నెలల వ్యవధిలో సూర్య సినిమాలు రూ.540 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లయింది. దీంతో సూర్య ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వరుసగా భారీ విజయాలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకుంటున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి కూడా ఈ విజయంతో హ్యాట్రిక్ అందుకున్నట్లయింది. గతంలో ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న ఆయన, ఇప్పుడు సూర్యతో రూపొందించిన ‘విశ్వనాథ్ & సన్స్’తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

