Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ నుంచి నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఫస్ట్ సింగిల్ రామ రామ అనే పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ పాట విడుదలకు ముందు దర్శకుడు వశిష్ట.. హైదరాబాద్ కర్మాన్‌ఘాట్‌లో ఉన్న ఆంజనేయస్వామిని దర్శించుకున్నాడు. శనివారం ఉదయం కర్మాన్‌ఘాట్ ఆలయంకు వెళ్లిన వశిష్టతో పాటు చిత్రబృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికి సినిమా పెద్ద హిట్టు అవ్వాలని కోరుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రబృందం తాజాగా పంచుకుంది.
Team #Vishwambhara took blessings at the Karmanghat Hanuman Temple on the occasion of Hanuman Jayanthi and the first single release ✨
First Single #RamaRaama out now 🏹
▶️ https://t.co/fLCfievw8lMusic by the Legendary @mmkeeravaani 🛐
Lyrics by ‘Saraswatiputra’ @ramjowrites… pic.twitter.com/0U7nkUSLGa— BA Raju’s Team (@baraju_SuperHit) April 12, 2025