Actor Vishwak sen | టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఈయన హీరోగా అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ వేడుకకు పవన్ గెస్ట్‌గా వచ్చి సినిమాను లాంఛ్ చేశాడు. కాగా ఇటీవలే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం మూడో షెడ్యూల్‌కు సిద్ధమౌతుంది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కారణం ఏంటో కూడా చెప్పకుండా విశ్వక్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. అయితే దీనిపై సీరియస్ అయిన అర్జున్ సర్జా, విశ్వక్ పై ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.
ఈ చిత్రానికి అర్జున్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. విశ్వక్‌కు జోడీగా ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తుంది. ‘కేజీఎఫ్’ ఫేం రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక విశ్వక్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో మంచి ప్రారంభం దక్కింది. ఇక లేటెస్ట్గా రిలీజైన ‘ఓరి దేవుడా’ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ దగ్గరలో ఉంది. వీటితో పాటుగా ఈయన ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో దాస్ కా ధమ్కీ అనే సినిమాకు దర్శకుడిగా కూడా పనిచేస్తున్నాడు.
Read Also:
రజనీ కూతురుతో లైకా సంస్థ కొత్త సినిమా.. ఆసక్తికరంగా ‘లాల్ సలాం’ టైటిల్ పోస్టర్
PS-2 | ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్-2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
Kantara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాంతార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శిరీష్‌తో డేటింగ్ చేస్తున్నావా అని అల్లు అరవింద్ అడిగారు: అను ఇమ్మాన్యూయేల్