VS10 | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak sen). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి విశ్వక్ సేన్ 10 (VS 10). డెమీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త న్యూస్ చెప్పారు మేకర్స్. డెబ్యూ డైరెక్టర్ రవితేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. VS10 టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వీడియోను ఆగస్టు 6న ఉదయం 11:11 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ.. హై ఫోర్స్ ఇంజిన్ త్వరలోనే షురూ అవుతుంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
విశ్వక్సేన్ మరోవైపు ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ 11 (VS 11)వ సినిమా కూడా చేస్తున్నాడు. VS 11 మూవీ ఇటీవలే రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. నేహా శెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
విశ్వక్ సేన్ దీంతోపాటు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గామి (Gaami) కూడా పూర్తి చేశాడు. ఈ మూవీలో అఘోరాగా కనిపించబోతున్నాడు విశ్వక్ సేన్. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న గామి విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది విశ్వక్ సేన్ టీం. విశ్వక్సేన్ మరోవైపు ధమ్ కీ సీక్వెల్ కూడా ఉండబోతున్నట్టు ప్రకటించాడని తెలిసిందే. వరుస సినిమాల అప్డేట్స్ ఇస్తూ మూవీ లవర్స్ ను ఖుషీ చేస్తున్నాడు విశ్వక్సేన్.
Stylish & intense ‘Mass ka Das’ @VishwakSenActor ‘s #VS10 is hitting the road soon🚗
Title announcement & glimpse on August 6th. Watch out!🔥🔥#ProductionNo7@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/rSkJV7lzAQ
— Ramesh Bala (@rameshlaus) July 23, 2023
VS 11 సెకండ్ షెడ్యూల్ పూర్తి..
2nd time I meet my Demi God darling Prabhas calling Personally and meet ❤️❤️ me and My wife
Thank you so much darling Prabhas
❤️❤️My Demi God Autograph#Prabhas❤️#JaiPrabhasAnna👑 #JaiAdipurush #HappyDeepavali @PrabhasRaju @TrendsPrabhas @TrendsRebelStar @Team_Prabhas pic.twitter.com/NkwxliDMBD
— Prabhas❤️ (@raj_prabhasfan) November 4, 2021