విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలాహి మీడియా సంస్థ నిర్మిస్తున్నది. ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తున్నది.
శనివారం రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్ను ఆవిష్కరించారు. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల నేపథ్యంలో ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత, నిర్మాతలు: యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా.