Vishwak Sen | విశ్వక్ సేన్ ప్రశ్నలకు అల్లు అరవింద్ ఫన్నీ సమాధానాలు.. ‘వన్ సైడ్ లవ్’ కామెంట్స్ వైరల్!
Vishwak Sen | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకే వేదికపై కనిపిస్తే వినోదానికి కొదవ ఉండదని మరోసారి నిరూపితమైంది. తాజాగా దీవానా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈవెంట్లో వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.
Vishwak Sen | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకే వేదికపై కనిపిస్తే వినోదానికి కొదవ ఉండదని మరోసారి నిరూపితమైంది. తాజాగా దీవానా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈవెంట్లో వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ప్రత్యేకంగా విశ్వక్ సేన్ అడిగిన ప్రశ్నలు, వాటికి అల్లు అరవింద్ ఇచ్చిన సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈవెంట్లో మాట్లాడిన విశ్వక్ సేన్, గీతా ఆర్ట్స్ నిర్మాతలపై సరదాగా వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా నిర్మాతలు ఎక్కువ సినిమాలు చేస్తే ఒత్తిడితో జుట్టు ఊడిపోతుంది. కానీ గీతా ఆర్ట్స్ వాళ్లు మాత్రం ఎప్పుడూ యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆ సీక్రెట్ ఏంటో చెప్పాలి అంటూ ప్రశ్నించారు.
దీనికి స్పందించిన అల్లు అరవింద్ చిరునవ్వుతో స్పందించగా, సభలో నవ్వులు పూశాయి. గీతా ఆర్ట్స్‌కు చెందిన యువ నిర్మాతలు కూడా చాలా యాక్టివ్‌గా, స్మార్ట్‌గా కనిపిస్తున్నారని విశ్వక్ సరదాగా వ్యాఖ్యానించారు. అవసరమైతే నా తొలి సినిమా రోజుల్లా మళ్లీ ఆడిషన్ ఇస్తాను. కానీ మీ బ్యానర్లో ఒక సినిమా చేసే అవకాశం ఇవ్వండి అని అన్నారు. దీనికి అల్లు అరవింద్ వెంటనే స్పందిస్తూ, “ఈ మధ్య నువ్వు రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతున్నావు” అంటూ సరదా కౌంటర్ ఇచ్చారు. అదే జోష్‌లో విశ్వక్ సేన్, మీ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి సార్. మాలాంటి వాళ్లకు కూడా కొంచెం పంచండి. ఈ థియేటర్ కూడా మీదే, మీరు కూర్చున్న కుర్చీ కూడా మీదే అంటూ చమత్కరించారు. దీంతో సభలో నవ్వుల సందడి నెలకొంది.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర ప్రతిపాదన కూడా చేశారు విశ్వక్. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో స్టూడియో నిర్మించాలని, అవసరమైతే తన స్థలం కూడా ఇస్తానని సరదాగా అల్లు అరవింద్‌కు సూచించారు. ఈ వ్యాఖ్యలు కూడా అభిమానులను అలరించాయి. ‘దీవానా’ చిత్రానికి “వన్ సైడ్ లవ్” అనే ట్యాగ్‌లైన్ ఉండటంతో, విశ్వక్ సేన్ మరో ఆసక్తికర ప్రశ్న వేశారు.సార్.. మీ జీవితంలో వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అని అడిగారు. దీనికి స్పందించిన అల్లు అరవింద్, “ఒకటా.. రెండా..? లెక్కలేనన్ని ఉన్నాయి” అంటూ సమాధానం ఇవ్వడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆయన సమాధానం విన్న వెంటనే సభలో నవ్వులు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ప్రస్తుత తరం ప్రేమ కథలపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఖాళీగా ఉన్న థియేటర్లకు వెళ్లడం, షాపింగ్ చేయడం, చివరికి ఓయో రూమ్‌లో ముగియడం… ఇదే కదా ఇప్పుడు చాలామంది చెప్పే ప్రేమకథ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ ఈవెంట్లో జరిగిన సరదా సంభాషణల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్ చమత్కారాలు, అల్లు అరవింద్ ఇచ్చిన స్పాంటేనియస్ సమాధానాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

