బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఎంత రసవత్తరంగా సాగుతుందో మనం చూశాం. 19మంది సభ్యులతో మొదలైన ఈ ఆటలో చివరకు 10 మంది మిగిలారు. తొలివారంలో సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారంలో లహరి, నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్, ఐదోవారంలో హమీదా, ఆరోవారంలో శ్వేత, ఏడోవారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో ఎలిమినేట్ అయ్యారు.ఇక తొమ్మిదో వారం విశ్వని ఎలిమినేట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
అసలు తొమ్మిదో వారం నామినేషన్స్‌లో హౌస్ కెప్టెన్‌గా ఉన్న షణ్ముఖ్ తప్ప.. మిగిలిన 10 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఆనీ మాస్టర్, మానస్లు స్పెషల్ పవర్‌తో సేవ్ కాగా.. మిగిలిన ఎనిమిది మంది జెస్పీ, సిరి, కాజల్, ప్రియాంక, యాంకర్ రవి, శ్రీరామ్, విశ్వ, సన్నీ నామినేట్ అయ్యి ఓటింగ్‌లో నిలిచారు. వీరిలో విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. అన్ని బాగానే ఉన్నా గొడవలు లేదంటే ఏడుపు ఈ రెండు విశ్వ ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయి అని అంటున్నారు.
విశ్వ ఎలిమినేట్ అయ్యాడు అంటే హౌజ్‌మేట్స్ కూడా నమ్మలేకపోయారు. టాస్కులో వంద శాతం ఇస్తాడు.. ఇంట్లో అందరితో కలిసి మెలిసి ఉంటాడు.. అలాంటి వాడు వెళ్లిపోతే ఎలా అంటూ ఆనీ, శ్రీరామచంద్ర మాట్లాడుకుంటారు. అయితే జనాలు కేవలం టాస్కులు అని చూడటం లేదేమో అని షన్ను, రవి, శ్రీరామచంద్ర అనుకుంటారు. ఇక బయటకు వచ్చిన విశ్వ తన జర్నీని చూసి ఎమోషనల్ అవుతాడు.