Aaryan Postponed | తమిళ నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 31న తమిళంతో పాటు తెలుగులో విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ను వాయిదా వేసింది. ఈ విషయాన్ని విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అక్టోబర్ 31న మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మాస్ జాతర’తో పాటు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్యన్ సినిమాను వారం పాటు వాయిదా వేస్తూ.. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు.
సినిమా అనేది రేసు కాదు – అది ఒక వేడుక అన్నది నా అభిప్రాయం. మా సినిమా ‘ఆర్యన్’ అక్టోబర్ 31న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇదే రోజున తెలుగులో రవితేజ ‘మాస్ జాతర’, బాహుబలి: ది ఎపిక్ రాబోతున్నాయి. నేను రవితేజను గాఢంగా అభిమానించే వ్యక్తిని. ఆయన నా సినిమా ‘గట్ట కుస్తీ’కి సహ నిర్మాతగా మద్దతు ఇచ్చారు. ఆయనపై ఉన్న గౌరవం, రాజమౌళి గారి ప్రాజెక్ట్ పట్ల ఉన్న అభిమానంతో ఆర్యన్ సినిమా విడుదలను వారం వాయిదా వేస్తున్నట్లు విష్ణు తెలిపాడు.
Dear Telugu audience,#Aaryan (Telugu) will meet you in cinemas one week later, on November 7.
With love and respect,
Vishnu Vishal. pic.twitter.com/82WiK9p8iG— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) October 28, 2025