బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన ప్రియుడు విష్ణు విశాల్‌తో ఏప్రిల్ 22న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.కరోనా వలన వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే పెళ్లి వీడియోని కొద్ది సేపటి క్రితం విష్ణు విశాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. జ్వాల గుత్తా బర్త్ డే సందర్భంగా ఈ వీడియో విడుదల చేశారు విష్ణు.ఇందులో హల్దీ వేడుకతో పాటు పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి.
ఈ విజువల్స్ చూస్తుంటే వీరి పెళ్లి హంగామా గ్రాండ్‌గానే జరిగినట్టు అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.కాగా, గుత్తా.. 2005లో తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ని మ్యారేజ్ చేసుకున్నారు. పలు కారణాలతో 2011లో విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నారు.ఇక విష్ణు విశాల్ వివాహం 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీతో జరిగింది. వీరికి ఆర్యన్ అనే బాబు ఉన్నాడు. 2018లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
విష్ణు, జ్వాల కంటే ఒక సంవత్సరం చిన్నవాడు కాగా, వీరిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి కావడం. కొంత కాలంగా డేటింగ్లో ఉన్న ఈ ఇద్దరు ఏప్రిల్ 22, 2021న మధ్యాహ్నం 1:40 గంటలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి రిసెప్షన్‌కి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.
Sharing with you all our wedding video…
— IRFAN AHMED (ABA) (@TheVishnuVishal) September 7, 2021
Thank you all for the love and support so far in this journey of LIFE…@Guttajwala
Thank you 'THE STORY BOX' for the lovely video…
▶️ https://t.co/AYq80CoHGD
Happy Birthday wishes to #JwalaGutta 🎂