Vishal | సినిమాలో అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అందించడం కోసం తీవ్రంగా కష్టపడే హీరోలకు ఇండస్ట్రీలో కొదవేమీ లేదు. అలాంటి హీరోల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటాడు విశాల్. ఈ టాలెంటెడ్ యాక్టర్ అభిమానుల కోసం ఎలాంటి రిస్కీ్ స్టంట్స్ చేయడానికైనా రెడీగా ఉంటాడు. విశాల్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మార్క్ ఆంటోనీ (Mark Antony) చిత్రంలో నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అయితే షూటింగ్ సమయంలో ఓ సీన్ చిత్రీకరిస్తుండగా.. ట్రక్కు అదుపుతప్పింది. ట్రక్కు కంట్రోల్ తప్పి ఒక్కసారిగా చిత్రయూనిట్వైపు దూసుకొచ్చింది. ఆ ట్రక్కు షూటింగ్లో పాల్గొంటున్న విశాల్ పక్క నుంచి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు విశాల్‌ను పక్కకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను విశాల్ ట్విట్టర్లో షేర్ చేశాడు.
సెకన్ల గ్యాప్‌లో, ఇంచు మందంలో.. తృటిలో ప్రాణాపాయం తప్పింది.. దేవుడికి ధన్యవాదాలు.. అంటూ ట్వీట్ చేశాడు విశాల్. రెప్పపాటులో పెను ప్రమాదం తప్పడంతో విశాల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. స్టంట్స్ సీక్వెన్స్‌లో నటించేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని విశాల్‌కు సూచిస్తున్నారు అభిమానులు.
మార్క్ ఆంటోనీ సెట్స్‌లో ప్రమాదం..
Jus missed my life in a matter of few seconds and few inches, Thanks to the Almighty
Numb to this incident back on my feet and back to shoot, GB pic.twitter.com/bL7sbc9dOu
— Vishal (@VishalKOfficial) February 22, 2023
Ugram teaser | అల్లరి నరేశ్ ఈజ్ బ్యాక్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ఉగ్రం టీజర్
Prabhas | బ్యాక్ టు షూట్.. మారుతి సినిమాకు ప్రభాస్ నయా డేట్స్