Prabhas | ‘సలార్’, ‘ప్రాజెక్ట్-k’ ఇలా బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు ప్రభాస్. అంత బిజీ షెడ్యూల్స్‌లోనూ కథలు వింటూ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది సీతారామంతో తిరుగులేని హిట్టు కొట్టిన హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వస్తున్న వార్తలే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని, త్వరలోనే అఫీషియల్ ప్రకటన ఉంటుందని ఇన్సైడ్ టాక్.
ఇదిలా ఉంటే మేకర్స్ ప్రస్తుతం కాస్ట్ అండ్ క్రూను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. అందులో భాగంగానే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్‌గా విశాల్ చంద్రశేఖర్‌ను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. కృష్ణగాడి వీర ప్రేమగాధ నుంచి సీతారామం వరకు హను సినిమాలకు విశాల్ చంద్రశేఖరే స్వరాలు సమకూర్చాడు. ఇక ఇప్పుడు ప్రభాస్‌తో చేయబోయే సినిమాకు కూడా విశాల్‌నే కన్సిడర్ చేశారట.
ఇక ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హను రాఘవపూడి.. ప్రభాస్ కోసం రూటు మార్చాడని తెలుస్తుంది.
వీళ్ల కాంబోలో తెరకెక్కబోయే సినిమా లవ్‌స్టోరీ కాదని, వరల్డ్ వార్ పీరియడ్ డ్రామా అని టాక్. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని ఇదే ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హను ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతుందట. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.