తమిళ నటుడు విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. కథానాయిక ధన్సికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను విశాల్ తన సోషల్మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. తన జన్మదినం రోజే ఎంగేజ్మెంట్ జరగడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో పెళ్లి తేదీని వెల్లడిస్తామని తెలిపారు. ధన్సికతో తన ప్రేమ బంధం గురించి విశాల్ కొద్దిరోజుల క్రితమే వెల్లడించారు.
ధన్సిక నటించిన ‘యోగీ దా’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన విశాల్.. అదే వేదికపై ధన్సికతో తన ప్రేమ వ్యవహారం గురించి తెలియజేశారు. కథానాయిక సాయిధన్సిక ‘కబాలి’ ‘షికారు’ ‘దక్షిణ’ ‘అంతిమ తీర్పు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ఇక ప్రస్తుతం విశాల్ ‘మకుటం’ అనే యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు.