Vishal| తమిళ స్టార్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆయన నటించిన పందెం కోడి సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పందెం కోడి సినిమా తరువాత వరుసగా విశాల్ ఖాతాలో హిట్ మీద హిట్లు పడడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా విశాల్ సక్సెస్ అయ్యాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. అయితే విశాల్ కెరియర్ పరంగా దూసుకుపోతున్నా పెళ్లి విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నాడు. దాంతో విశాల్ పెళ్లి చేసుకుంటాడా, ఆయనకి చేసుకునే ఉద్దేశం ఉందా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు.
హీరో విశాల్ వయస్సు ఫిఫ్టీకి చేరువవుతుండగా, ఆయనకి పెళ్లి విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరలక్ష్మీ శరత్ కుమార్‌తో లవ్ ట్రాక్ ముగిసిన తరువాత.. మన తెలుగు అమ్మాయి అనీషా రెడ్డి తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆర్నెళ్లు ఆమెతో సహవాసం చేసిన తరువాత ఒకర్నొకరు బాగా అర్ధం చేసుకుని పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కాని తర్వాత అనీషా రెడ్డి విశాల్‌కి బ్రేకప్ చెప్పి ఓ బిజినెస్‌మెన్‌ని వివాహం చేసుకుందని టాక్. ఇక ఈ మధ్య విశాల్ నటి అభినయను పెళ్ళాడబోతున్నట్టు నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అభినయ తెలుగు అమ్మాయి కాగా, సౌత్ లో లో దాదాపు అన్ని భాషల్లో నటించింది.
అభినయ పుట్టుకతో మూగ, చెవిటి కాగా, మంచి టాలెంట్ ఉన్న నటి. నటన విషయంలో ఏమాత్రం తగ్గకుండా మంచి పేరు తెచ్చుకున్న ఈ నటి ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె శంభో శివ శంభో, కింగ్, ఢమరుకం, నేనింతే, దమ్ము, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజుగారి గది2, సీతా రామం వంటి సినిమాలలో అద్భుతమైన నటనతో అదరగొట్టింది. ఈమెని విశాల్ పెళ్ళి చేసుకోబోతున్నాడని చాలా కాలం నుండి ఓ టాక్ నడుస్తుంది.. అయితే తాజాగా అభినయ ఓ పోస్ట్ పెట్టింది. చేతిలో చేయి వేసిన ఫోటోను పోస్ట్ చేసిన ఈ అమ్మాయి.,తన ఎంగేజ్మెంట్ జరిగినట్టు ప్రకటించడంతో విశాల్ సీక్రేట్ గా అభియతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.మరి అభినయ.. విశాల్‌ని వివాహం ఆడనుందా, లేకుండా చిన్నతనం నుంచి ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడబోతుందా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.