Virupaksha Movie On OTT | మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత ‘విరూపాక్ష’తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు. నెల రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లో ఇంకా ఈ సినిమా ప్రదర్శితం అవుతుంది. దానికి తోడు ఈ సినిమా తర్వాత రిలీజైన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ పెవిలీయన్ బాట పట్టడంతో ప్రేక్షకులకు మరో ఆప్షన్ కూడా లేక రీపీట్ షోలు వేశారు. పైగా చాలా కాలం తర్వాత మంచి థ్రిల్లర్ మూవీ రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇటీవలే హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇటివలే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లోనూ నిలిచింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా విరూపాక్ష ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో గత అర్థ రాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. 1979 కాలంలో రుద్రవనంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు.. ఆ ఊరి విధివిధానాలను మార్చేస్తాయి. అలా జరిగిన కొన్నేళ్లకు సాయిధరమ్ తేజ్ తల్లితో కలిసి రుద్రవనానికి వస్తాడు. అక్కడ తొలి చూపులోనే సంయుక్త మీనన్‌తో ప్రేమలో పడతాడు. ఊరు మొత్తం పీడశక్తి కారణంగా అల్లకల్లోలమవుతున్న సందర్భంలో.. సూర్య ధైర్యంగా నిలబడి, రుద్రవనానికి పట్టిన పీడను తొలగించడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. అసలు రుద్రవనంలో ఏం జరిగింది? ఆ ఊరి ప్రజలను కాపాడడానికి సూర్య చేసిన సాహసం ఏమిటి? అనేది ఈ సినిమా కథ
మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి తేజ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ఇక దర్శకుడిగా కార్తిక్ దండూ తొలి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించాడు. తొలి సినిమాకే ఈ రేంజ్లో అవుట్ పుట్ ఇచ్చాడంటే మాములు విషయం కాదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.