Pyre | ఆస్కార్ రేసులో మరో భారతీయ చిత్రం.. ఇండిపెండెంట్ రూట్లో ప్రయాణిస్తున్న ‘పైర్’!
Pyre | ప్రఖ్యాత జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు వినోద్ కప్రి తెరకెక్కించిన 'పైర్' (Pyre) సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ఎలాంటి పెద్ద బ్యానర్లు లేకుండా, పూర్తిగా స్వతంత్ర పద్ధతిలో ఈ చిత్రాన్ని 99వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) జనరల్ ఎంట్రీ విభాగాల కోసం పంపినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Pyre | ప్రఖ్యాత జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు వినోద్ కప్రి తెరకెక్కించిన ‘పైర్’ (Pyre) సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ఎలాంటి పెద్ద బ్యానర్లు లేకుండా, పూర్తిగా స్వతంత్ర పద్ధతిలో ఈ చిత్రాన్ని 99వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) జనరల్ ఎంట్రీ విభాగాల కోసం పంపినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిన్న చిత్రాలు కూడా తమ ప్రతిభ ఆధారంగా నేరుగా ఆస్కార్ బరిలో పోటీపడాలనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినోద్ కప్రి తెలిపారు. హిమాలయ ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ హృదయ విదారక కథా చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకోవడం విశేషం.
ఈ చిత్రం గురించి దర్శకుడు వినోద్ కప్రి మాట్లాడుతూ, తాము ఈ సినిమాను పూర్తిగా స్వతంత్రంగా, కథపై ఉన్న నమ్మకంతోనే తెరకెక్కించామని తెలిపారు. హిమాలయాలకు చెందిన ఒక మారుమూల గ్రామానికి చెందిన సాధారణ వృద్ధ దంపతుల కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది హృదయాలను హత్తుకుంటుందని తాము ఊహించలేదన్నారు. స్వతంత్ర చిత్రాలు కూడా ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటూ తమ కథలను ప్రపంచానికి చాటిచెప్పవచ్చని, అందుకే ఈ ఇండిపెండెంట్ సబ్మిషన్ రూట్ ఎంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, 99వ ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి సంతోష్ దావఖర్ తెరకెక్కించిన మరాఠీ చిత్రం ‘గొంధల్’ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. అలాగే తేజా రియో దర్శకత్వం వహించిన ‘అంగ్’ చిత్రం కూడా టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అవార్డు గెలుచుకోవడం ద్వారా ఆస్కార్‌కు అర్హత సాధించింది.
హిమాలయాల నేపథ్యంలో తెరకెక్కిన ‘పైర్’ చిత్రంలో ఉత్తరాఖండ్‌కు చెందిన పదం సింగ్, హీరా దేవి అనే ఇద్దరు సాధారణ వృద్ధులు ప్రధాన పాత్రల్లో నటించారు. దశాబ్దాలుగా తమ కొడుకు రాక కోసం ఎదురుచూసే వృద్ధ దంపతుల దైనందిన జీవితం, ఒంటరితనం, వలసలు, అనుబంధాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా అంతర్జాతీయ వేదికలపై 15 ‘ఉత్తమ చిత్రం’ అవార్డులతో పాటు మొత్తం 18 పురస్కారాలను కైవసం చేసుకుంది. అక్టోబర్ 30న హిందీలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే, భారీ బడ్జెట్ సినిమా ‘రామాయణం’ విడుదల నేపథ్యంలో థియేటర్లలో తమ చిత్ర ప్రదర్శనలను తగ్గించమని ఒత్తిడి తెచ్చారని ఇటీవల వినోద్ కప్రి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pyre | ఆస్కార్ రేసులో మరో భారతీయ చిత్రం.. ఇండిపెండెంట్ రూట్లో ప్రయాణిస్తున్న ‘పైర్’!
Niranjan Reddy | వనపర్తి ఇరిగేషన్ సీఈ ఆఫీస్ ఎదుట రైతులతో నిరంజన్ రెడ్డి ధర్నా.. వీడియో
‘నిరుపేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు అభినందనీయం’
‘సీతారామ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాల్వలు వెంటనే నిర్మించాలి’
Priya Bhavani Shankar | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ శంకర్.. ప్రియుడితో అంగరంగ వైభవంగా వివాహం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

