టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కాగా మూవీ లవర్స్ కోసం హీరో కిరణ్ అబ్బవరం టీం క్రేజీ అప్డేట్ అందించింది. వినరో భాగ్యము విష్ణుకథ టీజర్‌ను జనవరి 9న ఉదయం 10:15 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈ అప్డేట్ షేర్ చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. తాజా లుక్‌లో హీరోహీరోయిన్లు కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి వర్షపు జల్లుల్లో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ లవ్ ట్రాక్ కూడా ఈ చిత్రంలో ఉండబోతుందని లేటెస్ట్ పోస్టర్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు.
విలేజ్ డ్రామా నేపథ్యంలో సాగే స్టోరీతో వస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నాడు. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Revealing the genre of #VinaroBhagyamuVishnuKatha ✨
Teaser out on the 9th of JAN @ 10:15 am 🤩#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram
A @chaitanmusic Musical.@GA2Official @kashmira_9 @KishoreAbburu #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra #VBVK #VBVKTeaser pic.twitter.com/ElnmsTCMD4
— BA Raju's Team (@baraju_SuperHit) January 3, 2023