కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం’. వీఎస్ వాసు దర్శకుడు. జీఎంఆర్ మూవీస్ పతాకంపై మందల ధర్మారావు, గుంపు భాస్కర రావు నిర్మిస్తున్నారు. బుధవారం టైటిల్ పోస్టర్‌ను సీనియర్ దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు విడుదల చేశారు.
ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నానని హీరో కార్తిక్‌రాజు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, సంగీతం: జ్ఞాని, దర్శకత్వం: వీఎస్ వాసు.