Ranveer Singh | బాలీవుడ్ నుంచి వచ్చిన క్రేజీ ఫ్రాంచైజీలలో డాన్ ఒకటి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ చిత్రాలలో ప్రియాంక చోప్రా కథనాయికగా నటించింది. ఇప్పటివరకు రెండు పార్టులుగా వచ్చిన ఈ చిత్రం మూడో ఇన్స్టాలేషన్కి సిద్ధంమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి డాన్‌గా షారుఖ్‌ని కాకుండా.. రణ్వీర్ సింగ్‌ను చూపించబోతున్నాడు ఫర్హాన్. ఇప్పటికే ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రం తాజాగా ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో విలన్ పాత్రలో 12 ఫెయిల్ నటుడు వింక్రాంత్ మస్సే నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫర్హన్ అక్తర్ ఈ రోల్ కోసం వింక్రాంత్ని ఫైనల్ చేశాడని సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే రణ్వీర్ సింగ్ వింక్రాంత్ కలిసి లూటేరా అని సినిమాలో కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ డాన్ 3 కోసం కలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. రితేష్ సిద్వాని, ఫర్హన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుంది.