ఇటీవల ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసిన రాజమౌళి త్వరలో మహేష్‌తో మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటి వరకు తెలుగులో రాని కథాంశంతో తెరకెక్కించనున్నారన్న వార్తలు కూడా క్యూరియాసిటీని మరింతగా పెంచేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమా పూర్తికాగానే మహేష్ బాబుతో తెరకెక్కించనున్న సినిమాపై వర్కవుట్ ప్రారంభించనున్నాడు. అంటే వచ్చే ఏడాది జనవరి తర్వాత ఈ సినిమాపై ఫుల్ క్లారిటీ రానుంది.
ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇటీవల మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సమంతను హీరోయిన్గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంత ఇప్పటి వరకు మహేష్‌తో కలిసి దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ లక్కీ పెయిర్‌ను మరోసారి కలిపేందుకు జక్కన్న ప్లా్న్ వేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఇక తాజాగా ఇందులో విలన్ క్యారెక్టర్‌కు హీరో విక్రమ్ పేరును పరిశీలిస్తోందట చిత్రబృందం. మరి… ఈ వార్త నిజమేనా? అనే విషయం తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సింది. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్న మహేశ్‌బాబు ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమాలో హీరోగా నటిస్తారు.