Cobra | విక్రమ్ టీం అదిరిపోయే అప్డేట్..రిలీజ్ డేట్ ఫిక్స్
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ‘కోబ్రా’ (Cobra) ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆగస్టు 11న విడుదల కావాల్సింది. ప్రొడక్షన్ పనులు ఆలస్యం కారణంగా మరో డేట్ ఫైనల్ చేయనున్నట్టు ఇప్పటికే ఒకే అప్ డేట్ వచ్చింది.
స్టార్ హీరో విక్రమ్ (Vikram) త్వరలోనే కోబ్రా సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ‘కోబ్రా’ (Cobra) చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) డైరెక్ట్ చేస్తున్నాడు. కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా నటిస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆగస్టు 11న విడుదల కావాల్సింది. ప్రొడక్షన్ పనులు ఆలస్యం కారణంగా మరో డేట్ ఫైనల్ చేయనున్నట్టు ఇప్పటికే ఒకే అప్ డేట్ వచ్చింది.
తాజాగా ఈ డేట్ ఏంటో తెలియజేస్తూ..విక్రమ్ అభిమానులకు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఆగస్టు 31న థియేటర్లలో సందడి చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో విక్రమ్ ఫైట్ సన్నివేశంలో కనిపిస్తున్నాడు. శ్రీనిధి ఈ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈ ప్రాజెక్టుతో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
రోషన్ మాథ్యూ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, మృణాళినీ రవి, మియా జార్జ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కోబ్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.
#Cobra 🐍 (Tamil-Telugu-Kannada) In Theatres Worldwide From August 31 🔥#CobraFromAugust31#ChiyaanVikram
An @AjayGnanamuthu Film🎬
An @arrahman Musical🥁@RedGiantMovies_ @Udhaystalin @NVR_Cinemaoffl @IrfanPathan @SrinidhiShetty7 @SonyMusicSouth @UrsVamsiShekar @proyuvraaj pic.twitter.com/IUIIiTkoCB— Seven Screen Studio (@7screenstudio) August 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Ajay Gnanamuthu
- Cobra
- Vikram
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

