Vikram Remuneration | విక్రమ్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. తమిళంలో సమానంగా ఇక్కడ కూడా విక్రమ్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈయన సినిమాలకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాకున్నంత క్రేజ్ ఉంది. అయితే థియేటర్లో ఈయన సినిమా విడుదలై మూడేళ్ళవుతుంది. ఎప్పుడెప్పుడు ఈయన సినిమా థియేటర్లలో విడదులవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతేడాది మహాన్ విడుదలైన.. అది నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయింది. ప్రస్తుతం ఈయన నటించిన ‘కోబ్రా’ విడుదలకు సిద్ధంగా ఉంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. సై-ఫై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. దానికి తోడు ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా విక్రమ్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టంట తెగ వైరల్ అవుతుంది.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం కోబ్రా సినిమాకు విక్రమ్ దాదాపు 25కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడట. ఈ రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్లో దాదాపుగా 22% అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం విక్రమ్ బాగానే కష్టపడ్డాడట. మ్యాథమేటిక్స్ సైటింస్ట్‌గా ఏడు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నాడట. అంతేకాకుండా ఈ ఏడు పాత్రలకు విక్రమ్ స్వయంగా డబ్బింగ్ చెప్పాడట. ఈ క్రమంలోనే మేకర్స్ విక్రమ్ అడిగినంత పారితోషికాన్ని ఇచ్చారట. ఈ చిత్రంలో విక్రమ్‌కు జోడీగా ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.