16 ఏళ్ల అపరిచితుడు.. ఎన్నో రికార్డులు సాధించిన విక్రమ్ మూవీ

2005.. డబ్బింగ్ సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో ఓ సంచలన ఏడాది. ఆ ఏడాది తమిళ సినిమాలు మన దగ్గర అద్భుతాలు చేసాయి. చంద్రముఖి, ప్రేమిస్తే, గజిని, అపరిచితుడు లాంటి సినిమాలన్నీ ఒకే ఏడాది విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా అప్పట్లో మన సినిమాల కంటే ఎక్కువ వసూలు చేసి ట్రేడ్ పండితులను విస్తుపోయేలా చేసాయి. అందులో ఒక సంచలనం అపరిచితుడు. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. మొదట్లో ఎలాంటి వసూళ్ళు లేకపోయినా కూడా రెండు మూడు వారాల తర్వాత పుంజుకుని 100 రోజుల పాటు దిగ్విజయంగా ఆడింది అపరిచితుడు. వి. రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తన ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించాడు. అప్పటికే శివపుత్రుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విక్రమ్.. అపరిచితుడుతో స్టార్ అయ్యాడు. ఈ సినిమా 2005 జూన్ 17న విడుదలైంది. 16 ఏళ్ళు పూర్తి చేసుకున్న అపరిచితుడు అప్పట్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం..
నైజాం- 3.22 కోట్లు
సీడెడ్- 3.62 కోట్లు
ఉత్తరాంధ్ర- 2.12 కోట్లు
ఈస్ట్- 0.92 కోట్లు
వెస్ట్- 0.89 కోట్లు
గుంటూరు- 1.35 కోట్లు
కృష్ణా- 1.07 కోట్లు
నెల్లూరు- 0.52 కోట్లు
ఏపీ + తెలంగాణ- 13.71 కోట్లు
అప్పట్లో శంకర్ రేంజ్ బాగానే ఉండేది. అందుకే ఆయన పేరు చెప్పి అపరిచితుడు సినిమాను తెలుగులోనూ 6.7 కోట్లకు అమ్మారు. అప్పట్లో అది బాగా ఎక్కువ మొత్తమే. అయితే విడుదలైన తర్వాత ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఒక్కో వారం గడిచే కొద్దీ అపరిచితుడుకు కలెక్షన్ల పంట పండింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 14 కోట్ల షేర్ వసూలు చేసింది అపరిచితుడు. ఈ సినిమాతోనే మొన్న మరణించిన లెజెండరీ కమెడియన్ వివేక్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. రాము, రెమో, అపరిచితుడుగా విక్రమ్ నటన అందర్నీ మెప్పించింది.
ఇవి కూడా చదవండి..
కిడ్నీ క్యాన్సర్ లక్షణాలివే..
Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు
నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’
ఢిల్లీ ఎయిమ్స్‌లో అందుబాటులోకి ఓపీడీ సేవలు
డెల్టా వేరియంట్‌కు స్పుత్నిక్-వీ బూస్టర్ డోస్
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
2024 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 50శాతం తగ్గించడమే లక్ష్యం : కేంద్రమంత్రి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aparichitudu
- Vikram
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

