Cobra Movie | విక్రమ్ ‘కోబ్రా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
Cobra Movie Release Date | చియాన్ విక్రమ్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో ఈయనకు క్రేజ్ ఉంది. విక్రమ్ నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ఇటీవలే అమెజాన్‌లో నేరుగా విడుదలైన ‘మహాన్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. కోలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ఈ చిత్రం ఒకటి. అజయ్ జ్ణానముత్తు దర్శకత్వం వహించాడు. గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడింది. అయితే తాజాగా మేకర్స్ కోబ్రా విడుదల తేదీని ప్రకటించారు.
కోబ్రా చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదలకానుంది. ప్రముఖ దిగ్గజ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.
#Cobra #CobraFromAugust11 #ChiyaanVikram 😬😬❤️❤️🐍🐍 @arrahman @7screenstudio @SrinidhiShetty7 @IrfanPathan @roshanmathew22 pic.twitter.com/49L5fw5PTH
— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) June 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

