Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Vijay’s Son Jason Sanjay | తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు జేసన్ సంజయ్ త్వరలోనే నటుడిగా అరంగేట్రం చేయనున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Vijay’s Son Jason Sanjay | తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు జేసన్ సంజయ్ త్వరలోనే నటుడిగా అరంగేట్రం చేయనున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ‘సిగ్మా’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, ఇప్పుడు మెగాఫోన్‌ను పక్కన పెట్టి కెమెరా ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, జేసన్‌తో ఇప్పటికే ‘సిగ్మా’ సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఆయనతో మరో సినిమా చేయడానికి తీవ్రంగా ఆసక్తి చూపుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో జేసన్ సంజయ్ హీరోగా నటించే అవకాశాలున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన హీరోగా నటించబోయే కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రముఖ దర్శకుడు లింగుసామితో పాటు మరికొందరు డైరెక్టర్లు కథలను వినిపించినట్లు సమాచారం. అంతేకాకుండా, జేసన్ సంజయ్ బంధువైన ప్రముఖ నటుడు సంజీవ్ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించే రేసులో ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

