Vijay Devarakonda-Samantha | గ్రాండ్‌గా లాంఛ్ అయినా విజయ్ సమంతల కాశ్మీర్ ప్రేమకథ!
Vijay Devarakonda-Samantha | విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి భారీ పరాజయం తర్వాత విజయ్ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్‌ను పెడుతున్నాడు. ఈ క్రమంలోనే పూరీ దర్వకత్వంలో ‘లైగర్’ సినిమాను పూర్తి చేశాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులలో బిజీగా ఉంది. దీంతో పాటుగా విజయ్, పూరి దర్శకత్వంలోనే జనగణమన సినిమాను చేయనున్నాడు. ఇటీవలే విడుదలైన పోస్టర్, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘లైగర్’ విడుదల తర్వాతే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. దాంతో విజయ్, శివ నిర్వాణ సినిమాను ముందుకు తీసుకువచ్చాడు..
లేటెస్ట్గా ఈ చిత్రం లాంఛనింగ్ కార్యక్రమాలను హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నాయి. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు కొరటాల శివ, హరీష్ శంకర్, బుచ్చిబాబు, బాబీలు ముఖ్య అతిథిలుగా వచ్చారు. బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా హరీష్‌శంకర్ క్లాపింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా సమంత హీరోయిన్గా నటించనుంది. మణిరత్నం ‘రోజా’ తరహాలో ఈ చిత్రం కాశ్మీర్ నేపథ్యంలో జరిగే ప్రేమకథ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 23నుంచి జరుగనుంది. ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ అధికారిగా నటించగా,సమంత కాశ్మీరి అమ్మాయిగా నటించనుంది. ఇటీవలే మలయాళంలో సూపర్ హిట్టయిన ‘హృదయం’ ఫేం హీషమ్ అబ్ధుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతం వహించనున్నట్లు టాక్.
#VijayDeverakonda #ShivaNirvana #SamanthaRuthPrabhu’s Next Launched. #VD11 is Produced by #MythriMovieMakers
Music by #Hridayam fame #Heshamabdulwahab
Shoot begins this month.#VD11Launch pic.twitter.com/kdRzxMe8e8
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

