Vijayashanti | టాలీవుడ్ సీనియర్ యాక్టర్ విజయశాంతి (Vijayashanti) సుమారు 14 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై రీ ఎంట్రీ ఇచ్చారని తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ తర్వాత పొలిటికల్‌గా బిజీగా అయిన విజయశాంతి కొత్త సినిమా ఏం ప్రకటించలేదు. తాజాగా విజయశాంతి నయా చిత్రంపై ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
బింబిసారతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) NKR21 (వర్కింగ్ టైటిల్)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే NKR21 సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ షేర్ చేయగా.. పిడికిలి బిగించి ఉన్న కల్యాణ్ రామ్ చేతిపై రక్తపు మరకలున్న లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు.
యాక్షన్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రం నుంచి షూటింగ్ స్పాట్ విజువల్స్తోపాటు అదిరిపోయే పంచ్‌తో కట్ చేసిన NKR21 గ్లింప్స్ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. అలా ఎలా చిత్రాన్ని నిర్మించిన అశోక క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. ఈ బ్యానర్లో ఇది రెండో సినిమా. ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీలో సోహైల్‌ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జెట్‌స్పీడ్‌లో కొనసాగుతోంది.
NKR21 గ్లింప్స్..
‘𝐓𝐇𝐄 𝐅𝐈𝐒𝐓 𝐎𝐅 𝐅𝐋𝐀𝐌𝐄’ from #NKR21
Shoot in progress.#JoharNTR
@vijayashanthi_m garu @saieemmanjrekar @PradeepChalre10 @SunilBalusu1981 #AshokMuppa @AJANEESHB @harie512 @NTRArtsOfficial @AshokaCOfficial— BA Raju’s Team (@baraju_SuperHit) May 28, 2024
NKR21 లుక్..
The FIST of FURY 🔥👊🔥@NANDAMURIKALYAN in an action-packed powerful role ❤️🔥#NKR21 shoot begins soon 🔥#HappyBirthdayNKR @PradeepChalre10 #AshokaMuppa @SunilBalusu1981 @harie512 @AshokaCOfficial pic.twitter.com/qb9S2TwCee
— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2023