Arjun Chakravarthy | విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. కాగా, ఈ సినిమా టీజర్‌ను ఇవాళ డైరెక్టర్ హను రాఘవపూడి విడుదల చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజ జీవితం ఆధారంగా రూపొందిన అర్జున్ చక్రవర్తి సినిమా టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. ‘ ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి 9నెలలు మోస్తుంది. నేను కూడా ఈ సినిమాని మీకు చూపించడానికి తొమ్మిదేళ్లుగా మోశాను. నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పర్సన్ ని కలిసాను. ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. అది నా మనసులో అలాగే నాటురేపోయింది. ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలి భావించను. అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది.’ అని తెలిపారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంటుందని.. అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.
హీరో విజయరామరాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీజర్ ని లాంచ్ చేసిన హను గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇది చాలా ఆనందాన్నిచ్చింది. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం చాలా అరుదు. మా డైరెక్టర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను ఏదైనా పర్ఫామెన్స్ చేశానంటే అది మా డైరెక్టర్ గారి వల్లే. ఆయన అద్భుతంగా మలుచుకున్నారు. చాలా డెడికేటెడ్ డెడికేషన్ తో ఈ సినిమా తీశారు. నిరంతరం సినిమా కోసమే తపించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. చాలా మంచి సినిమా ఇది. చాలా కష్టపడి చేశాం. మీరందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.