ఊపిరి సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలుకరించాడు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ స్టార్ డైరెక్టర్ ఈ ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో వారిసు తెరకెక్కించాడు. వంశీ పైడిపల్లి ఇటీవలే విడుదలైన వారిసుతో తమిళ చిత్రపరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో వారసుడు టైటిల్‌తో విడుదలైంది. వారిసు తమిళంలో సూపర్ హిట్టవగా.. తెలుగులో ఆకట్టుకోలేకపోయింది.
కథ, కథనం కొత్తగా లేకున్నా.. విజయ్ స్టార్డమ్ ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిందని ట్రేడ్ పండితుల విశ్లేషణ. కాగా ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వంశీపైడిపల్లికి విజయ్ (Vijay) మరో సినిమా చేసే అవకాశం ఇస్తున్నట్టు ఓ వార్త కోలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. వంశీపైడిపల్లితో మంచి స్క్రిప్ట్ సిద్దం చేయాలని విజయ్ చెప్పాడని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఈ కథ విజయ్ను ఇంప్రెస్ చేస్తే.. దళపతి 69వ ప్రాజెక్ట్‌గా రావడం ఖాయమనే టాక్ నడుస్తోంది.
కమర్షియల్ ఎలిమెంట్స్, కుటుంబ నేపథ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ వంశీ పైడిపల్లి వారిసు తెరకెక్కించిన తీరు విజయ్‌కు బాగా నచ్చిందట. ఈ కారణం వల్లే వంశీపైడిపల్లికి మరో సినిమా చేసే ఛాన్స్ ఇస్తున్నాడని టాక్. ప్రస్తుతం విజయ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి 67 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి లియో టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.