సందీప్‌కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో ‘మైఖేల్’ పేరుతో ఓ పాన్ ఇండియన్ చిత్రం తెరకెక్కుతోంది. నారాయణదాస్ కె నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. రంజిత్ జెయకోడి దర్శకుడు. సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. ఇందులో ఓ చేతికి బేడీలు వేసి ఉండగా మరో చేతిలో నకల్(ఇనుముతో చేసిన ఆయుధం) పట్టుకొని సందీప్‌కిషన్ కనిపిస్తున్నారు. ‘యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. సందీప్‌కిషన్, విజయ్ సేతుపతి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నాం. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని ప్రకటిస్తాం’ అని నిర్మాతలు తెలిపారు. ‘మనిషి స్వతహాగా ప్రేమను కోరుకునే సాధు జంతువు కాదు. శత్రువుపై ఎదురుదాడి చేయడానికి తయారుగా ఉండే మూర్ఖమైన క్రూర జంతువు. అలాంటి ఓ మనిషి కథే ఈ సినిమా’ అని దర్శకుడు పేర్కొన్నారు.