పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం గీతా గోవిందం. ఈ సినిమా తర్వాత విజయ్, రష్మికపై చాలా రూమర్స్ వచ్చాయి. ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి నటించకపోయిన అప్పుడప్పుడు ఏదో ఒక చోట కలుస్తూ సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఈ ఇద్దరు జిమ్లో కుస్తీలు చేస్తూ ఫొటోకు ఫోజులిచ్చారు. వీరితో సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ కుల్దీప్ సేథీ కూడా ఉన్నారు.
అంకితభావం కృషితో ఏదైనా సాధ్యమే అంటూ ఇద్దరు స్టార్ల ఫోటోలను షేర్ చేసారు కుల్దీప్.ఇక సినిమాల విషయానికి వస్తే పూరి జగన్నాథ్ . లైగర్ చిత్రానికి సంతకం చేసినప్పటి నుండి విజయ్ గత 2 సంవత్సరాలుగా జిమ్ లో కఠినంగా శ్రమిస్తున్నాడు. అతను మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా కనిపిస్తాడు. మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా రష్మిక గొప్ప ఫిట్ నెస్ ఫ్రీక్ గా వెలిగిపోతోంది. ఈ అమ్మడు తెలుగు, తమిళం,హిందీలలో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం పుష్ప లో అల్లు అర్జున్ సరసన .. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో శర్వానంద్ తోనూ కలిసి నటిస్తోంది. అటు బాలీవుడ్ లో యువహీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను లో నటిస్తోంది. అలాగే బిగ్ బి అమితాబచ్చన్ నటిస్తోన్న గుడ్ బై చిత్రంలో డాటర్ పాత్రను పోషిస్తోంది. మర రెండు బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేసినట్టు కూడా తెలుస్తుంది.