సక్సెస్‌లు లేక దిగాలుగా ఉన్న అల్లరి నరేష్‌కి నాంది చిత్రం ఎంత పెద్ద విజయం అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందగా, ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ బాగానే రాణించింది. బుక్ మై షోలో ఏకంగా వందకు 92 శాతం రేటింగ్ వచ్చింది.
నాంది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు విజయ్ కనకమేడల రెండేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘నాంది’ సినిమా ఆయనకి డెబ్యూ చిత్రం. ప్రస్తుతం ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే చైతూకి ఒక కథను కూడ వినిపించాడని, అది కొత్తగా ఉండడం, సమంతకు కూడా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసినట్టు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే బయటకు రాలేదు. ప్రస్తుతం చైతు ‘లవ్ స్టోరీ’ సినిమాని పూర్తిచేసుకొని విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. సాయి పల్లవి కథానాయిక కాగా, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు.
మరోవైపు చైతు, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. బంగార్రాజు సినిమాతోను చైతూ నటిస్తున్నాడు. మరి ఈ సినిమాల తరువాత చైతు విజయ్ కనకమేడల దర్శకత్వంలో చేస్తారా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.