నగరంలో షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ఆయన హీరోగా నటిస్తున్న 67వ సినిమా ‘లియో’ రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మాస్టర్’ తర్వాత విజయ్‌తో ఆయన రూపొందిస్తున్న రెండో చిత్రమిది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుతున్నారు. అక్కడ చిత్రీకరణ ముగించుకుని కొద్ది రోజుల్లోనే మూవీ యూనిట్ హైదరాబాద్ రానుందని సమాచారం. ఇక్కడ కీలక సన్నివేశాలను రూపకల్పన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. త్రిష నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో సంజయ్ దత్, నివీన్ పాలి, పృథ్వీరాజ్ సుకుమార్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. స్టార్ కాస్టింగ్, భారీ మేకింగ్‌తో ఈ సినిమా సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తున్నది. అక్టోబర్ 19న ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నది.