Vijay Deverakonda Birthday | టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ శనివారం తన 37వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. బర్త్డే సందర్భంగా విజయ్ అభిమానులు అతడి ఇంటివద్దకు రాగా.. వారిని కలిసి సందడి చేశాడు. ఈ వేడుకలో ఆయన భార్య, నటి రష్మిక మందన్న కూడా పాల్గొని అభిమానులకు అభివాదం చేసింది. వివాహం తర్వాత విజయ్ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం విజయ్ అభిమానుల మధ్య కేక్ కట్ చేసి వారితో ముచ్చటించారు, దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, విజయ్ ఇటీవల శౌర్యువ్ దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. దీనితో పాటు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘రణబలి’ అనే చారిత్రాత్మక యాక్షన్ డ్రామాలో ఆయన నటిస్తున్నారు. 1854 – 1878 కాలమానం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ స్వాతంత్ర్య సమరయోధుడు రణబలిగా కనిపిస్తుండగా, రష్మిక జయమ్మ అనే పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం.
#VijayDeverakonda joins his fans for a special cake cutting as a massive crowd gathers at his residence.🔥#HBDVijayDeverakonda pic.twitter.com/TF29ANB9Lx
— Suresh PRO (@SureshPRO_) May 9, 2026