‘నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి సందీప్. ఆ ప్రేమ గురించి మాటల్లో చెప్పలేను. మా బంధం అన్నింటికీ అతీతమైనది. ‘అర్జున్‌రెడ్డి’ టైమ్‌లో మేం ఓ యుద్ధమే చేశాం. మా దగ్గర డబ్బు లేదు. పేరు లేదు. పలుకుబడి లేదు. కేవలం ధైర్యాన్ని కూడగట్టుకొని చేసిన సినిమా ‘అర్జున్‌రెడ్డి’. చివరకు పొలం అమ్మి నాతో సినిమా చేశాడు సందీప్. ఆ ఒక్క సినిమా జీవితాలను మార్చేసింది. అలాంటి సందీప్ తీసిన సినిమా ఇది. అంటే ఇది కూడా నా సినిమానే. సుమంత్ ప్రభాస్‌ని చూసినప్పుడు అతని కళ్లలో కసి కనిపించింది. తను సక్సెస్ అవుతాడని అప్పుడే అనుకున్నా.
‘అర్జున్‌రెడ్డి’ టైమ్‌లో సక్సెస్ అవుతుందా? లేదా? అనే ఆలోచన మాలో ఉండేది కాదు. ఎంజాయ్ చేస్తూ కసిగా ఎఫర్ట్ పెట్టాం. గ్రాండ్ సక్సెస్ కొట్టాం. గుండెల్లో కసి ఉండాలి. అదొక్కటుంటే చాలు సక్సెస్ ఎప్పుడైనా కొట్టొచ్చు. ఈ సినిమాతో సుమంత్ తప్పకుండా సక్సెస్ అవుతాడు. ‘రోమాంచికం’ విజయం పక్కా. భద్రకాళి లోగో, నేపథ్యంలో వచ్చే ‘అర్జున్‌రెడ్డి’ ఆర్ఆర్ తెలుగోడి సత్తా దేశానికి ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. పనిచేసిన వారందరికీ ఈసినిమా పేరు తీసుకురావాలి’ అని విజయ్ దేవరకొండ అన్నారు.
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ‘రోమాంచికం’. వేణుగోపాల్‌రెడ్డి దర్శకుడు. భద్రకాళీ పిక్చర్స్ పతాకంపై సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మించిన ఈచిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడారు. సమర్పకుడు సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు నవ్వొచ్చింది. చెప్పినట్టే తీస్తావా? అనడిగా.. ఓ సీన్ తీసి చూపించాడు.
చెప్పిన దానికంటే బాగా తీశాడనిపించింది. ఒక్కరోజు కూడా నేను సెట్‌కి వెళ్లలేదు. డైరెక్టర్ వేణు సినిమా చాలా బాగా తీశాడు. ఈ సినిమాలో అంతా దాదాపు కొత్తవాళ్లే. సుమంత్ ప్రభాస్ ైస్టెల్ ఏదైతే ఉందో.. సూపర్. అనంతిక పర్ఫార్మెన్స్ అద్భుతం. మ్యూజిక్ అమేజింగ్. సెప్టెంబర్ 2న రాత్రి ప్రీమియర్ ఉంది. దర్శకుడు వేణుకి సెప్టెంబర్ 3 ప్రత్యేకమైన రోజు కావాలని కోరుకుంటున్నా. సినిమా అంతా గట్టిగా నవ్వుతారు. పెట్టిన ఖర్చుకు సరిపడా నవ్వించే సినిమా ఇది. తప్పక చూడండి’ అని చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందంతో పాటు మెహర్ రమేశ్, సునీల్ నారంగ్ కూడా మాట్లాడారు.