Family Star | టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ హీరో టైటిల్ రోల్లో ఫ్యామిలీ స్టార్ (Family Star) చిత్రంలో నటిస్తున్నాడు. గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. VD13 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేశారు మేకర్స్.
ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం నుంచి గోపీ సుందర్ కంపోజిషన్‌లో వచ్చే నంద నందనా సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ రాశారు. ఈ విషయంతోపాటు ఫ్యామిలీ స్టార్ హిందీలో కూడా సందడి చేయబోతుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మేకర్స్. ఈ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. మేకర్స్ ఇటీవలే షేర్ చేసిన టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ.. కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అని విజయ్ దేవరకొండ క్లాస్ లుక్‌లో చెబుతున్న మాస్ డైలాగ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
విజయ్ దేవరకొండ దీంతోపాటు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో VD12లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. కాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తన్నాయి. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023