ముఖ్య గమనిక మరియు దిద్దుబాటు: ఈ కథనంలో ప్రస్తావించిన వైరల్ వీడియోలో ఉన్నది విజయ్ దేవరకొండ అని తప్పుగా పేర్కొనబడింది. దయచేసి పూర్తి వాస్తవాల కోసం కింద ఉన్న మా దిద్దుబాటు ప్రకటనను చదవండి.
దిద్దుబాటు: వైరల్ వీడియోపై చేసిన తప్పుడు క్లెయిమ్ గురించి
మేము ప్రచురించిన కథనంలో, గోడ ఎక్కుతున్న ఒక వైరల్ వీడియోను చూపి, అందులో ఉన్న వ్యక్తి నటుడు విజయ్ దేవరకొండ అని, తన కొత్త సినిమా ‘కింగ్డమ్’ కోసం స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొన్నాము.
ఈ సమాచారం పూర్తిగా తప్పు అని మేము స్పష్టం చేస్తున్నాము.
నిజం: ఆ వీడియోలో ఉన్న వ్యక్తి విజయ్ దేవరకొండ కాదు. అతను ఇరాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ పార్కోర్ అథ్లెట్, శ్రీ మోస్థాఫా హోర్మతి (Mostafa Hormati).
నిజానిజాలు నిర్ధారించుకోకుండా, ఈ తప్పుడు సమాచారాన్ని ప్రచురించినందుకు మేము తీవ్రంగా చింతిస్తున్నాము. ఈ పొరపాటు వల్ల పాఠకులు తప్పుదారి పట్టినందుకు, మరియు విజయ్ దేవరకొండకు, శ్రీ మోస్థాఫా హోర్మతికి అనవసరంగా కలిగిన ఇబ్బందికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము.
భవిష్యత్తులో ఎలాంటి సమాచారాన్నైనా ప్రచురించే ముందు దాని యదార్థతను క్షుణ్ణంగా పరిశీలిస్తామని హామీ ఇస్తున్నాము.
Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండని వరుస ఫ్లాపులు పలకరిస్తున్నా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. సినిమా ఫ్లాప్ అయిన కూడా ప్రతి సినిమాలో తన నటనతో మెప్పిస్తూనే ఉన్నాడు. ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు నిరాశపరిచిన తర్వాత, కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ దేవరకొండ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తున్నారు.ఈ సినిమాతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా నిరూపించేందుకు సిద్ధమవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన ‘కింగ్డమ్’ మూవీ ఈ నెల జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. బాక్సాఫీస్ వద్ద చాలా కాలంగా విజయ్ సరైన హిట్ లేక పోవడంతో, ఫ్యాన్స్‌కి ‘కింగ్డమ్’పై భారీ ఆశలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, విజయ్ దేవరకొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు, ఆయన తీవ్ర నీరసం కారణంగా హాస్పిటల్‌కి వెళ్లగా వైద్యులు డెంగ్యూ అని నిర్ధారించారని తెలుస్తోంది. కనీసం మూడు రోజులపాటు వైద్య పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్టు తెలుస్తుంది. ఈ వార్తలపై విజయ్ టీమ్ గానీ, కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో అభిమానులు ఆయన ఆరోగ్యంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
తప్పుగా ఉన్న వాక్యాలు ఇవి :
మరోవైపు విజయ్ దేవరకొండకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది కదా మా హీరో డెడికేషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీడియోలో విజయ్ దేవరకొండ ఓ సందులో రెండు కాళ్లని బ్యాలెన్స్ చేసుకుంటూ గోడపైకి అవలీలగా ఎక్కేస్తాడు. విజయ్ దేవరకొండ డెడికేషన్‌కి ఫిదా అయిన ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
(Corrected Paragraph):
మరోవైపు, ఒక వ్యక్తి గోడపైకి అవలీలగా ఎక్కుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఆ వీడియోలో ఉన్నది నటుడు విజయ్ దేవరకొండ అని చాలామంది పొరబడ్డారు. అతనే అని భావించి, “ఇది కదా మా హీరో డెడికేషన్” అంటూ అభిమానులు కామెంట్లు చేశారు.
వాస్తవానికి, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి విజయ్ దేవరకొండ కాదు. అతను ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ పార్కోర్ అథ్లెట్, మోస్థాఫా హోర్మతి (Mostafa Hormati). ఈ విధంగా, విజయ్ దేవరకొండ పేరుతో ఒక తప్పుడు క్లెయిమ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.