Vijay Devarakonda|టాలీవుడ్ యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండకి ప్రత్యేక శైలి ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అంతా ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో విజయ్‌కు లవర్ బాయ్ ఇమేజ్ దక్కింది. అయితే మంచి టాలెంట్ ఉన్న ఈ హీరో సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాపులు వస్తున్నా కూడా మాస్ ఇమేజ్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. డియర్ కామ్రేడ్, లైగర్ లాంటి సినిమాలతో యాక్షన్ ట్రై చేసిన అక్కడ కూడా విజయ్‌ని అదృష్టం వరించలేదు. అలా అని తనకి కలిసొచ్చిన జానర్ ఖుషీ చేసిన అది అంతంత మాత్రమే ఆడింది.
ఇప్పుడు విజయ్ మాస్ ఆడియన్స్ కోసం మంచి కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. సెట్స్‌పై ఉన్న కింగ్ డమ్ ప్యాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా కోసం కెరీర్లో ఫస్ట్ టైమ్ పోలీస్‌గా నటిస్తున్నారు రౌడీ బాయ్. దీని తర్వాత రాహుల్ సంక్రీత్యన్తోనూ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు విజయ్.మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ రూరల్ మాస్ డ్రామాకు కూడా కమిటయ్యారు విజయ్ దేవరకొండ. దీనికి రౌడీ జనార్ధన్ అనే టైటిల్ ఖరారు చేశారు.. 2026లో సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా విజయ్ పాత్ర పేరు జనార్ధన్ కాగా, ఆయన నాన్న పేరు కూడా జనార్థనేనట.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా, రౌడీ జనార్ధన్ అనే టైటిల్‌తో రియల్ మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ విజయ్ దేవరకొండ స్టైల్ కి పర్ఫెక్ట్గా సరిపోతుందని అంటున్నారు. విజయ్ దేవరకొండకు ‘రౌడీ’ అనే ట్యాగ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు రౌడీ టైటిల్‌తో సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాతో విజయ్ తన విశ్వరూపం చూపించనున్నాడని కామెంట్ చేస్తున్నారు.